లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపుర్‌లో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌షూటర్ నవీన్‌కుమార్ మృతి చెందాడు. ఈ ఘటనను అధికారులు ధృవీకరించారు. అతనిపై హత్యలు, దోపిడీ, కిడ్నాప్ సహా 20కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు.
యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (UPSTF) మరియు ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. హాపుర్ సమీప అటవీ ప్రాంతంలో నవీన్‌కుమార్ ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే, పోలీసులను గమనించిన అతను అటవీ ప్రాంతంలోకి పారిపోవడానికి ప్రయత్నిస్తూ కాల్పులకు తెగబడ్డాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో నవీన్ గాయపడి, ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇతను ఘజియాబాద్ జిల్లా లోని ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. అతను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా, మరో గ్యాంగ్ సభ్యుడు హషీం బాబాతో కలిసి పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా హత్యలు, బెదిరింపులు, దోపిడీలు వంటి పెద్దఎత్తున నేరాలకు పాల్పడుతూ చర్చల్లోకి వచ్చింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు, అలాగే ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యలో కూడా ఈ గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం జైల్లో ఉన్నప్పటికీ, అక్కడి నుంచే మొబైల్ ఫోన్ల ద్వారా తన అనుచరులకు ఆదేశాలు జారీ చేస్తూ నేరాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో నేరగాళ్లను శాశ్వతంగా నియంత్రించేందుకు పోలీస్ శాఖ చర్యలు ముమ్మరం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Read More : సీఎం రూ.500 నోట్ల రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి.

One thought on “లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నవీన్‌కుమార్ మృతి.”
Comments are closed.