ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణం గడియారం స్థంభం వద్ద ఒక వ్యక్తి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం… జగన్ కాన్వాయ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఆ జనం ఒత్తిడికి తాళలేక ఆ వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయనకు అక్కడే ఉన్నవారు వెంటనే సీపీఆర్ చేసినప్పటికీ స్పృహకు రాలేదు.
ఇదిలా ఉండగా, జగన్ కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయే సమయంలో, ఆ వ్యక్తి పరుగెత్తుతూ వెళ్లిన సందర్భంలో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read More : కేంద్ర నిర్ణయంపై పవన్ కల్యాణ్ స్పందన

One thought on “జగన్ పర్యటనలో విషాదం: ఒకరు మృతి”
Comments are closed.