ప్రధాని మోదీ అమరావతికి పర్యటన: ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది.

ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రి వర్గ ఉపసంఘ సమావేశం ఈరోజు (సోమవారం) విజయవాడలోని ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో జరగనుంది. త్వరలో మంత్రులు ఈ సమావేశానికి చేరుకోనున్నారు.

ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమగ్ర నివేదికతో హాజరయ్యేలా సంబంధిత అధికారులకు మంత్రులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగూరు నారాయణ, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్‌తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Read More : తిరుమలలోని విశాఖ శారదా పీఠం భవనాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటోంది

One thought on “ప్రధాని మోదీ అమరావతికి పర్యటన: ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

Comments are closed.