తిరుమలలోని విశాఖ శారదా పీఠం భవనాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటోంది

తిరుమలలోని విశాఖ శారదా పీఠం మఠానికి పెద్ద షాక్ తగిలింది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఈ పీఠం ఓ భవనాన్ని నిర్మించుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ అక్రమ నిర్మాణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ అనంతరం, హైకోర్టు టీటీడీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పు ఆధారంగా, టీటీడీ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటూ, విశాఖ శారదా పీఠం నిర్మించిన భవనాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. హైకోర్టు ఈ నిర్మాణాలను కూల్చివేయాలని సూచించింది. తాజాగా, టీటీడీ పీఠం వారికీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా భవనాన్ని ఖాళీ చేసి, టీటీడీకి అప్పగించాలని సూచించింది.

Read More : అఘోరీపై దళిత సంఘాల ఫిర్యాదు…