ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న అమరావతికి పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రధానమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. ఈ పర్యటనలో అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవంతో పాటు, రాజధానిలో వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ₹1 లక్ష కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు, దీంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పర్యటనలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధాని మోదీ అమరావతిలో ప్లాన్డ్ రోడ్ షోని భద్రతా కారణాల వలన రద్దు చేశారు. భద్రతా సిబ్బంది, రాష్ట్ర పోలీసులకు ప్రత్యామ్నాయ చర్యలు సూచించారు. ఈ నేపథ్యంలో, ప్రజలకు వాహనంలో ఉండి అభివాదం చేయాలని నిర్ణయించారు.
ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం, మే 2న మధ్యాహ్నం 2:55 గంటలకు తిరువనంతపురం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత 3:15 గంటలకు అమరావతి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 3:25 గంటలకు సభ వేదికకు చేరుకుని, 4:45 గంటల వరకు రాజధాని పునఃప్రారంభ సభలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమానికి 100 మంది వీఐపీలు, 15 ఎంఐపీలు, 5,000 మంది వీఐపీలు పాల్గొనే అవకాశముంది. భారీ జనసమూహం కోసం పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
