సమంత శుభం: కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా

Samantha debut production Shubham movie

ఇప్పటివరకు స్టార్ హీరోయిన్‌గా మాత్రమే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత, ఇప్పుడు నిర్మాతగా కూడా కొత్త ప్రయత్నం చేస్తోంది. ఆమె నిర్మాణంలో వచ్చిన తొలి సినిమా “శుభం” మంచి ఆశలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సమంత ఈ సినిమాతో తన టేస్ట్‌ని చూపించనుంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల మనసులను ఆకట్టుకునే కథతో “శుభం” టీవీ సీరియల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది.

“శుభం” కథలో, ఒక టీవీ సీరియల్ చూస్తున్న మహిళలు వారి ప్రవర్తనలో మార్పులు చేసుకునే విధానాన్ని చూపించటం ఉంటుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలకు దగ్గరగా ఉండే కథ. ఈ చిత్రం నిర్మాతగా సమంత మొదటి ప్రయత్నమే కావడంతో ఈ సినిమాపై అనేక ఆశలు ఉన్నాయి.

సమంత ఈ సినిమా ట్రైలర్‌లో చేసిన సర్‌ప్రైజ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముందు నుంచి ట్రైలర్‌లో ఆమె పాత్రను రివీల్ చేయడం కంటే చివరలో ఆమెని చూపించడం ఒక సర్‌ప్రైజ్ అని చెప్పొచ్చు. “శుభం” సినిమా మే 9న విడుదలకు సిద్ధమైంది. ఈ డేట్‌లో వచ్చిన సినిమాలు పలు సంచనలాలు సృష్టించాయి.

సమంత తన కెరీర్‌లో ఇదే మొదటి సారి నిర్మాతగా పరిచయం కావడంతో, ఆమె అభిమానులు ఈ సినిమా ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తారన్నది ఆసక్తి రేపుతుంది. ఇక, సమంత ఇప్పుడు బాలీవుడ్‌లో వెబ్ సీరీస్‌లలో కూడా నటిస్తోంది, కానీ తెలుగులో ఆమె ఈ ప్రాజెక్టుతో మనదైన శైలిలో మళ్లీ కనిపించేందుకు సిద్ధం.

Read More



One thought on “సమంత శుభం: కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా

Comments are closed.