పాము హీరోగా థ్రిల్ కలిగించే “ఫణి” మూవీ

Phani Movie Snake Hero

టాలీవుడ్ దర్శకుడు వీఆన్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న “ఫణి” మూవీ ప్రేక్షకులను థ్రిల్ ఫీల్ కలిగించేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. AU&I సమర్పణలో OMG ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్ కేథరిన్ ట్రెసా ప్రధాన పాత్రలో నటించగా, మహేష్ శ్రీరామ్, నేహా కృష్ణ, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, రంజిత, యోగిత ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో మోషన్ పోస్టర్ విడుదల చేయగా, కేథరిన్ తన కెరీర్‌లో ఈ సినిమా ఒక డైమండ్‌గా నిలుస్తుందని, ఆదిత్య గారి విభిన్న శైలి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు.

దర్శకుడు వీఆన్ ఆదిత్య మాట్లాడుతూ, “ఫణి” చిత్రీకరణ దశలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని, అమెరికాలోని డల్లాస్‌లో సినిమా మొత్తం చిత్రీకరించిన మొదటి భారతీయ చిత్రంగా “ఫణి” నిలిచిందని తెలిపారు. మొదట చిన్న చిత్రంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, కేథరిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా విస్తరించిందని వివరించారు. మూవీ కోసం ఐదు రోజుల పాటు వివిధ పాములను ఆడిషన్ చేసి, చివరకు బ్లాక్ పైన్‌ అనే పామును హీరోగా ఎంచుకున్నామని, మూడు కెమెరాలతో ప్రతి సన్నివేశాన్ని పూర్తి జాగ్రత్తలతో చిత్రీకరించామని అన్నారు. కేథరిన్‌కు పాములంటే భయమున్నా, ఎంతో ధైర్యంతో తన పాత్రను పోషించిందని ప్రశంసించారు.

“ఫణి” మూవీ నిర్మాత డాక్టర్ మీనాక్షి అనిపిండి, ఆమె భర్తతో కలిసి సినిమాను నిర్మించడం తనకెంతో ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని చెప్పుకున్నారు. నిర్మాతలుగా అడుగుపెట్టడానికి ముందు అన్ని సన్నాహాలు పూర్తిచేసుకున్నామని, ఈ ప్రయాణం ఎంతో సవాళ్లతో కూడుకున్నదని తెలిపారు. ఆదిత్య గారు కుటుంబ సభ్యులైనా కూడా, ప్రాజెక్ట్ విషయంలో ఏ విధమైన రాయితీలు ఇవ్వలేదని, కఠినమైన మానసిక ప్రిపరేషన్‌తో సినిమాను తెరకెక్కించారని అన్నారు. “ఫణి” మూవీ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని, విభిన్నమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందని చిత్రబృందం ధీమాగా ఉంది.

Read More

One thought on “పాము హీరోగా థ్రిల్ కలిగించే “ఫణి” మూవీ

Comments are closed.