నెట్‌ఫ్లిక్స్ ఎంపురాన్ విషయంలో తీసుకున్న నిర్ణయం

Netflix Empuraan Streaming Decision

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన సొంత రూట్‌లో ముందుకు సాగుతూ, ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రజాదరణను సంపాదించుకుంది. కేవలం ఇండియాలోనే కాకుండా గ్లోబల్‌గా విపరీతమైన వ్యూయర్స్‌ను ఆకర్షించుకుంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లను విభిన్న భాషల్లో అందిస్తూ, ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఎప్పటికప్పుడు అనేక చిత్రాల డిజిటల్ హక్కులను కొనుగోలు చేస్తూ, వాటిని వివిధ భాషల్లో స్ట్రీమ్ చేస్తూ, ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది.

సినిమా హక్కులను సొంతం చేసుకున్న తర్వాత, వాటిలో వివాదాస్పద డైలాగ్స్ లేదా సీన్లు ఉంటే, నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకోసం ఆయా సినిమాల మేకర్స్‌తో సంప్రదించి, మ్యూట్ వెర్షన్‌ను స్ట్రీమ్ చేస్తోంది. రీసెంట్‌గా విడుదలై హిట్ అయిన “తండేల్” చిత్రంపై కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. ఈ నేపథ్యంలో మాలీవుడ్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన “ఎంపురాన్” విషయంలో నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

“లూసిఫర్” సినిమా సీక్వెల్‌గా వచ్చిన “ఎంపురాన్” కొన్ని సీన్ల కారణంగా వివాదంలో నిలిచింది. సెన్సార్ బోర్డు 24 కట్స్ సూచించడంతో, రన్ టైమ్ 2.8 సెకన్లు తగ్గించింది. నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న తర్వాత, ట్రిమ్ కాకుండా ఒరిజినల్ వెర్షన్ స్ట్రీమ్ చేస్తుందని పలువురు భావించారు. అయితే గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, ట్రిమ్ వెర్షన్‌ను స్ట్రీమ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. ఈ విధంగా ఎలాంటి వివాదాలకు తావులేకుండా ముందుకుసాగుతోంది.

Read More

One thought on “నెట్‌ఫ్లిక్స్ ఎంపురాన్ విషయంలో తీసుకున్న నిర్ణయం

Comments are closed.