ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్పై బయట ఉండి సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్యకు సంబంధించి సాక్షులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళనకరమని షర్మిల వ్యాఖ్యానించారు.
వివేకా కుమార్తె సునీతకు ప్రాణహాని ఉందని పేర్కొన్న ఆమె, నిందితుల నుంచి ముప్పు ఉందనే భయం తమలో ఉందని తెలిపారు. తనకు ఇటీవల కొన్ని కీలక విషయాలు తెలిసాయంటూ షర్మిల వ్యాఖ్యానించారు. సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఆమె భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో కీలక అంశాలు ఉన్నాయని షర్మిల తెలిపారు. విచారణ అధికారులను అవినాశ్ రెడ్డి పిలిపించుకుని బెదిరించారని, తప్పుడు రిపోర్టుపై అధికారులతో సంతకాలు చేయించారని అఫిడవిట్లో పేర్కొన్న విషయాలను ఆమె వెల్లడించారు.
అవినాశ్ రెడ్డి బెయిల్పై ఉండడం వల్లే సునీతకు న్యాయం జరగడం లేదని షర్మిల ఆరోపించారు. వివేకా హత్య జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో ఉన్నది అవినాశ్ రెడ్డేనని ఆమె స్పష్టం చేశారు.
Read More : మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

One thought on “వైఎస్ వివేకా హత్య కేసు: అవినాశ్ బెయిల్ రద్దు చేయాలి – షర్మిల”
Comments are closed.