నేషనల్ క్రష్ రష్మిక మందన్నపై ఇటీవల వస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు పెద్ద వివాదంగా మారాయి. ఆమెపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ కమ్యూనిటీ నిలిచింది. రష్మికకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ కొడవ నేషనల్ కౌన్సిల్ (CNC) అధ్యక్షుడు ఎన్‌యు నాచప్ప కేంద్రం, కర్ణాటక ప్రభుత్వాలకు లేఖ రాశారు.
కొడవ హక్కుల పరిరక్షణ సంస్థ అయిన CNC రష్మిక భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ వివాదాల్లో ఆమెను అనవసరంగా లాగుతున్నారని CNC ఆరోపించింది. రష్మిక కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, ఆమెను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం అని పేర్కొంది.
రష్మిక తన కృషితో, ప్రతిభతో మంచి పేరు తెచ్చుకుందని, కానీ కొందరు రాజకీయ కారణాల వల్ల ఆమెను టార్గెట్ చేస్తున్నారని CNC అధ్యక్షుడు నందినేర్వండ నాచప్ప పేర్కొన్నారు. ఆమెను మానసికంగా వేధించడం తగదని, తక్షణమే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గనిగ రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఆమె హాజరు కాకపోవడాన్ని విమర్శించారు. రష్మికను ఒక కార్యక్రమానికి ఆహ్వానిస్తే ఆమె “కర్ణాటక ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించిందని పేర్కొంటూ, ఆమెకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఇప్పటి వరకు రష్మిక ఈ వివాదంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే, ఆమెకు మద్దతుగా అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

One thought on “రష్మిక మందన్నకు అండగా కొడవ కమ్యూనిటీ – భద్రత కల్పించాలని డిమాండ్”
Comments are closed.