పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పవర్ స్టార్ సినిమా అంటే క్రేజ్ ఊహించదగినదే. కానీ ఈ ప్రాజెక్ట్ నాలుగు ఏళ్లుగా మొదలుకాకుండానే నిలిచిపోయింది.
రామ్ తల్లూరి నిర్మాణంలో SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రావాల్సిన ఈ సినిమా, మొదట ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. తర్వాత స్క్రిప్ట్ పూర్తయ్యాయని వార్తలు వచ్చినా, షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఊస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలతో పాటు రాజకీయ బాధ్యతల్లో కూడా పూర్తిగా బిజీగా ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో ఉండడంతో, సినిమాలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారని సమాచారం.
ఈ పరిస్థితుల్లో, మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను వేరే హీరోతో కొనసాగించాలనే భావనలో ఉన్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కథలో మార్పులు చేయకుండా, కొత్త హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ హీరో ఎవరో ఇంకా స్పష్టత లేదు.
నిర్మాత రామ్ తల్లూరి ఇప్పటికే పవన్ కళ్యాణ్‌కు అడ్వాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏదో ఒక సినిమా చేయాలన్న ఉద్దేశంతో పవన్ కూడా డేట్స్ కేటాయించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు రాజకీయ బాధ్యతలు ఎక్కువ కావడంతో, ఆయన సినిమాలు చేస్తారా లేదా అన్నది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్‌కు సంబంధించి కొత్త డీల్ జరుగుతుందా, లేక పవన్ తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక, సురేందర్ రెడ్డి ప్రస్తుతం ‘రేసర్’ అనే కొత్త ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా వాస్తవంగా జరుగుతుందా లేక లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.

One thought on “పవన్ సినిమాకు బ్రేక్..? అడ్వాన్స్ విషయంపై సస్పెన్స్!”
Comments are closed.