రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం గీసిన దేశెట్టి శ్రీనివాసులు

నంద్యాల జిల్లా నందికొట్కూరులో పవన్ కళ్యాణ్ అభిమానులు తమ ప్రేమను వ్యక్తపరచడంలో విభిన్న రీతులు అనుసరిస్తుంటారు. తాజాగా హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ పట్ల తన అభిమానాన్ని తెలియజేయడానికి స్వయంగా తన రక్తంతోనే పవన్ కళ్యాణ్ చిత్రాన్ని గీశారు.

తనకు పవన్ కళ్యాణ్ అంటే ఉన్న అభిమానమే ఈ సాహసానికి ప్రేరణ అని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని గీయడానికి ముందు రక్తం సేకరించి, ప్రత్యేక పద్ధతిలో ఆర్ట్ వర్క్ పూర్తి చేసినట్లు వివరించారు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం చేస్తున్న రాజకీయ, సామాజిక సేవలు తనను బాగా ఆకట్టుకున్నాయని, ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని ఈ రూపంలో వ్యక్తపరిచానని దేశెట్టి తెలిపారు.

Read More : మంత్రివర్గ విస్తరణ ప్రచారం అబద్ధం ..?