ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై వస్తున్న ప్రచారంపై అధికారిక స్పష్టత వచ్చింది. “మంత్రివర్గం విస్తరణ అనేది పూర్తిగా అబద్ధం” అని టీడీపీ సీనియర్ నేతలు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రస్తుత మంత్రివర్గం సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తోందని, మంత్రులంతా ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు.
జైటిడిపి తమ ఎక్స్ (ట్విట్టర్) వేదిక ద్వారా స్పందిస్తూ, “ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులంతా పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. మంత్రివర్గ విస్తరణపై వస్తున్న వార్తలు వాస్తవం కావు” అని ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మంత్రివర్గంలో మార్పులు లేవని స్పష్టమైంది. ప్రస్తుత మంత్రివర్గంతోనే ప్రభుత్వం తీసుకున్న ప్రణాళికలు అమలు చేస్తూ ముందుకు సాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read More : లిక్కర్ స్కాం: మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్, ఈడీ దర్యాప్తు

One thought on “మంత్రివర్గ విస్తరణ ప్రచారం అబద్ధం ..?”
Comments are closed.