డిప్యూటీ సీఎం కు ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా పవన్‌కు అభినందనలు తెలియజేశారు.

ప్రధాని మోదీ ప్రశంసలు:

పవన్‌ కల్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అలాగే, ‘పవర్ స్టార్’గా ఆయన లక్షలాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమిని బలోపేతం చేస్తూ, రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని ప్రధాని కొనియాడారు. ఈ పోస్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read More : డాక్టర్ వైఎస్ఆర్ 16వ వర్ధంతి: వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు