రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు కొనసాగుతున్నాయి. ఈ కొనుగోళ్లపై అమెరికా ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసి, అదనంగా 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ భారత ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు అమెరికా ఆంక్షలను పట్టించుకోకుండా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపలేదు.
తాజాగా రష్యా భారత్‌కు మరింత రాయితీ ఇచ్చింది. బ్రెంట్ ధరతో పోలిస్తే బ్యారెల్‌కి 3 నుండి 4 డాలర్ల వరకు తక్కువ ధరకు చమురు సరఫరా చేయడానికి అంగీకరించింది. ఈ తగ్గింపు ధరలు సెప్టెంబర్ చివరి వారం, అక్టోబర్ నెలలో జరిపే కొనుగోళ్లకు వర్తిస్తాయని రష్యా ప్రకటించింది.
గత వారం భారత్ కొనుగోలు చేసిన ఉరల్స్ గ్రేడ్ చమురుపై బ్యారెల్‌కి 2.5 డాలర్ల డిస్కౌంట్ లభించిందని సమాచారం. ప్రస్తుతం భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా 31.4 శాతం కాగా, తరువాతి స్థానాల్లో ఇరాక్ (17.1%), సౌదీ అరేబియా (16.1%), యూఏఈ (11.8%) ఉన్నాయి.
రష్యా నుంచి ప్రధానంగా ఉరల్స్ చమురే ఎగుమతి అవుతుంది. తాజాగా సముద్ర మార్గం ద్వారా ఈ చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
Read More : ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విషాదం: భూకంపానికి 600కి పైగా మృతి.

One thought on “రష్యా చమురుపై భారత్‌కి భారీ రాయితీలు”
Comments are closed.