కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విచారణ సాగింది. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా నిరోధించాలని వారు కోర్టును ఆశ్రయించారు.
విచారణలో రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు జరగనుందని, అయితే ఆ దర్యాప్తుకు ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధం ఉండదని కోర్టుకు తెలిపారు.
వాదనలు విన్న హైకోర్టు, ఈ కేసులో లోతైన విచారణ అవసరమని స్పష్టం చేసింది. దాంతో విచారణను అక్టోబర్ 7కి వాయిదా వేసింది. అప్పటివరకు కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోర్టు స్పష్టంచేసింది. ఈ తీర్పుతో ఇద్దరికీ తాత్కాలిక ఉపశమనం లభించింది.
Read More : మృతుడని భావించిన వ్యక్తి తిరిగి బ్రతికాడు.

One thought on “కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్ రావుకు హైకోర్టు తాత్కాలిక ఊరట.”
Comments are closed.