పులివెందులలో జగన్ వీఐపీ పాసుల వివాదం – Minister

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయినా తన శైలిలో మార్పు కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో ప్రజలను కలవడానికి వీఐపీ పాసులు జారీ చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలతో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విషయంపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించారు. “సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం, కానీ సొంత నియోజకవర్గంలో సొంత కార్యకర్తలను కలవడానికి వీఐపీ పాసులు ఏమిటి? ఇది ఎప్పుడూ వినలేదూ, చూడలేదూ” అంటూ వ్యాఖ్యలు చేశారు.

Read More : డిప్యూటీ సీఎం కు ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్

One thought on “పులివెందులలో జగన్ వీఐపీ పాసుల వివాదం – Minister

Comments are closed.