పహల్గాం ఉగ్రదాడిలో మృతులకు సీఎం ట్రిబ్యూట్

పహల్గాం ఉగ్రదాడిలో అమరులైన టూరిస్ట్లు , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవప్రదంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.

ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అందరూ రెండు నిమిషాల పాటు మౌనంగా నిలిచారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, అమరుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.

Read More : ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్