తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడి ఎంపికపై తుది నిర్ణయం కేంద్ర అధిష్ఠానానిదేనని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “బీజేపీ ఒక ప్రజాస్వామ్య పార్టీ. అధ్యక్ష పదవి కోసం ఎవరైనా నామినేషన్ వేయొచ్చు. అయితే తుది నిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుంది. ఎవరైనా నాయకుడు సూచించినా, అధికారికంగా పార్టీ ప్రకటించేవారే బాధ్యతలు చేపడతారు,” అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే బీసీ వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై మండిపడ్డ బండి సంజయ్, గతంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ‘‘ఇప్పుడు బీసీలకు సీఎంగా లేక పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తామంటే ఆ పార్టీకి ఆత్మవిశ్వాసముందా?’’ అంటూ బీఆర్ఎస్‌ను సవాల్ చేశారు.

Read More : తెలంగాణ బీజేపీలో కలకలం: రాజాసింగ్ పార్టీకి రాజీనామా

One thought on “తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Comments are closed.