పార్టీ మార్పు ప్రచారాలపై క్లారిటీ

harish rao

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పార్టీ మారనున్నారన్న ప్రచారాలపై కీలకంగా స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాలను ఖండిస్తూ, వాటిపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

కేటీఆర్ నాయకత్వంపై ఇప్పటికే అనేకసార్లు తన అభిప్రాయం వెల్లడించానని, బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి సమస్యలు లేవని హరీశ్ రావు స్పష్టం చేశారు. “పార్టీ మారుతానన్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవే. ఈ చిల్లర ప్రచారాలను వెంటనే నిలిపేయాలి,” అని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగా కొనసాగుతానని, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలను పూర్తిగా పాటిస్తానని హరీశ్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్‌కు నాయకత్వ భాద్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని అన్నారు.

ఈ వ్యాఖ్యలతో ఆయన పార్టీ మారుతున్నారన్న వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టినట్టయ్యింది.

Read More : పాక్‌పై మళ్లీ సంచలన వ్యాఖ్యలు

One thought on “పార్టీ మార్పు ప్రచారాలపై క్లారిటీ

Comments are closed.