11 మంది సైనికుల మృతి, 200 మందికి పైగా గాయాలు.

పహల్గామ్‌లో భారత జవానులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పింది. ఈ దాడి వల్ల తీవ్ర నష్టాలు జరిగాయని పాకిస్తాన్ తాజాగా అధికారికంగా అంగీకరించింది.

భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌లో 11 మంది పాకిస్థాన్ సైనికులు మృతి చెందినట్లు పాక్ డీజీ ఐఎస్‌పీఆర్ వెల్లడించింది. వీరిలో ఆరుగురు పాక్ ఆర్మీకి, మరో ఐదుగురు వైమానిక దళానికి చెందినవారని తెలిపింది.

ఇంకా వివరాల్లోకి వెళితే—ఈ దాడిలో 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు, మరో 121 మంది గాయపడ్డారు. ఇక సైన్యంలో మృతి చెందినవారిలో నాయక్ అబ్దుల్ రెహమాన్, లాన్స్ నాయక్ దిలావర్ ఖాన్, ఇక్రముల్లా, వకార్ ఖలీద్, ముహమ్మద్ అదీల్ అక్బర్, నిసార్ ఉన్నారు.

వైమానిక దళం నుండి స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్, చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పోరల్ టెక్నీషియన్ ఫరూఖ్, ముబాషిర్‌ మరణించినట్లు పాక్ ప్రకటించింది.

ఇక భారత్ వెర్షన్ ప్రకారం ఈ ఆపరేషన్‌లో 35–40 మంది పాక్ సైనికులు, 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ దాడితో పాక్ లోపల నెలకొన్న అస్థిరత మరింత స్పష్టమవుతోంది.

Read More : సమాచారం ఇస్తే రూ.20 లక్షల రివార్డ్

One thought on “11 మంది సైనికుల మృతి, 200 మందికి పైగా గాయాలు.

Comments are closed.