టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఈ సందర్భంగా ఆయన చేతిలో “మురుగ: ది లార్డ్ ఆఫ్ వార్” అనే పుస్తకాన్ని పట్టుకొని ఉండటం స్పెషల్ ఆకర్షణగా మారింది. ఈ పుస్తకాన్ని చూసిన వెంటనే ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఎన్టీఆర్ కొత్త సినిమాకు సంబంధమై ఉండొచ్చని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
ఎప్పుడూ తన పాత్రలకు ప్రాముఖ్యతనిచ్చే ఎన్టీఆర్, నటనకు అవసరమైన విషయాలను ముందుగానే అధ్యయనం చేసే తీరు అందరికీ తెలిసిందే. తాజాగా “మురుగ” అనే పుస్తకం చదివే సమయంలో కనిపించడంతో, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా యుద్ధ నేపథ్యం లేదా మురుగన్ దేవుడిపై ఆధారపడే కథతో ఉంటుందన్న అంచనాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఎన్టీఆర్ పుస్తకాన్ని పట్టుకొని కనిపించటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
Read More : మహేష్‌ను చూసి తక్కువగా ఫీలయ్యాను: త్రిష

One thought on “ముంబై ఎయిర్‌పోర్టులో NTR … చేతిలో ‘మురుగ బుక్ ‘”
Comments are closed.