నిధి అగర్వాల్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ‘హరిహర వీరమల్లు’లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, గతంలో పలుమార్లు వాయిదా పడినందున, ఈసారి థియేటర్లలో ఖచ్చితంగా విడుదలవుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
నిధి అగర్వాల్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ బాధ్యతలను తన భుజాలపై తీసుకునే అవకాశముంది. పవన్ కళ్యాణ్ సాధారణంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తి కాకపోవడంతో, ఈసారి కూడా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. అయితే, రాజకీయ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన ఆ ఈవెంట్‌కైనా హాజరవుతారా? రారా? అన్నదానిపై కూడా సందేహాలు ఉన్నాయి.
ఇక మరోవైపు నిధి అగర్వాల్ పాన్-ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘రాజాసాబ్’ చిత్రంలో నటిస్తోంది. అయితే, చిత్రీకరణలో ఆలస్యం కారణంగా ఈ సినిమా ఇంకా సెట్స్‌లోనే ఉంది. విడుదల తేదీపై స్పష్టత లేకపోయినా, ప్రతి సందర్భాన్ని నిధి తన ప్రమోషన్‌కి వినియోగించుకుంటోంది.
టాలీవుడ్ వర్గాల ప్రకారం, ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ప్రభాస్ పెద్దగా పాల్గొనే అవకాశంలేదు. సాధారణంగా, ఆయన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి మాత్రమే హాజరవుతారు. మరోవైపు, ‘పౌజీ’ చిత్రీకరణలో బిజీగా ఉండటంతో, ఆయన షెడ్యూల్ ముందుగా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
దీంతో ‘హరిహర వీరమల్లు’ ప్రమోషన్‌లానే ‘రాజాసాబ్’ ప్రచార బాధ్యతలూ నిధి అగర్వాల్‌పై పడేలా ఉన్నాయి. మొత్తానికి, రెండు భారీ ప్రాజెక్టుల ప్రచారాన్ని నిధి ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి!

One thought on “నిధి అగర్వాల్‌పై రెండు పెద్ద సినిమాల ప్రమోషన్ బాధ్యత!”
Comments are closed.