సక్సెస్ తర్వాత గ్యాప్.. ఐశ్వర్య ప్లాన్‌ ఇదేనా?

Aishwarya Rajesh upcoming Telugu movie

తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ ప్రస్తుతం తన కెరీర్‌లో కీలక నిర్ణయం తీసుకునే దశలో నిలిచింది. సంక్రాంతికి విడుదలైన వెంకటేష్‌ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో పాటు ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ సినిమాలో వెంకటేష్‌తో పోటీ పడేలా ఐశ్వర్య నటన చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తాయని అంచనాలు పెరిగాయి. కానీ ఇప్పటివరకు ఆమె తన తదుపరి తెలుగు సినిమాను అధికారికంగా ప్రకటించలేదు.

తన సక్సెస్‌ను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఐశ్వర్య కొత్త సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. స్క్రిప్ట్ బలంగా ఉంటేనే ప్రాజెక్ట్ చేయాలని ఆమె నిర్ణయించుకుంది. ప్రస్తుతం రెండు కథలను ఫైనలైజ్ చేసిన ఆమె, జూలై తర్వాత వాటిని ప్రకటించే అవకాశముంది.

తమిళంలో కరుప్పర్ నగరం, మోహన్ దాస్, తీయావర్ కులైగల్ నడుంగ సినిమాల్లో నటిస్తుండగా, కన్నడలో ఉత్తరకాండ అనే సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. త్వరలోనే ఆమె తదుపరి తెలుగు సినిమా వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Read More





One thought on “సక్సెస్ తర్వాత గ్యాప్.. ఐశ్వర్య ప్లాన్‌ ఇదేనా?

Comments are closed.