రెండు దశాబ్దాలుగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిష కృష్ణన్ ప్రస్తుతం తమిళం మరియు తెలుగులో అనేక ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా తన రాబోయే సినిమాల ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిష ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 2005లో విడుదలైన సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘అతడు’ సినిమాను గుర్తుచేసుకున్నారు.
ఈ సినిమా తన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి అని చెబుతూ, సైనికుడు సినిమాలో కూడా మహేష్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని వివరించారు. షూటింగ్ సమయంలో మహేష్ బాబు ప్రదర్శించిన క్రమశిక్షణ తనను ఆశ్చర్యపరిచిందని త్రిష అన్నారు. మహేష్ ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే సెట్లోకి వచ్చి, రాత్రి వరకు అక్కడే ఉంటారని తెలిపారు.అతడి సీన్ లేకపోయినా, మానిటర్ దగ్గర కూర్చొని ఇతర సన్నివేశాలను కూడా శ్రద్ధగా గమనిస్తారని పేర్కొన్నారు. ‘‘మహేష్‌ను చూస్తుంటే నన్ను నేను తక్కువగా ఫీలయ్యే పరిస్థితి వచ్చింది. నా సీన్లు పూర్తయ్యాక ఇంటికి వెళ్ళేందుకు సిద్ధమయ్యే సమయానికి అతను అక్కడే ఉండేవాడు. అతనిలో ఉన్న నిబద్ధత నిజంగా అద్భుతం,” అని త్రిష తెలిపారు.
త్రిష చెప్పిన ఈ మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కెమెరా వెనుక నటులు ఎలా నిష్టగా పనిచేస్తారో చూపించే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేష్ బాబు పని పట్ల ఉన్న నిబద్ధతను త్రిష నిజాయితీగా వెలుగులోకి తీసుకురావడం అభిమానులకు మరింత దగ్గర చేసింది.
Read More : డ్రగ్స్ కేసులో తమిళ నటుడు శ్రీరామ్ కోర్టులో అంగీకారం

One thought on “మహేష్‌ను చూసి తక్కువగా ఫీలయ్యాను: త్రిష”
Comments are closed.