ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విషాదం

ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులను హత్యచేసి, తానే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. వేములవాడకు చెందిన రవిశంకర్, చంద్రిక దంపతులకు హిరణ్య (9), లీలసాయి (7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే రెండు నెలల క్రితం పిల్లలను భర్త వద్ద వదిలేసి చంద్రిక వెళ్లిపోయింది.

ఈలోగా రవిశంకర్ తీవ్ర మనస్తాపానికి గురై తనను తాను మరియు తన పిల్లలను చంపే నిర్ణయం తీసుకున్నాడు. తన మృతికి ఎవరూ బాధ్యులు కారని, జీవితంలో ఏమి సాధించలేదని పిల్లలను చంపి తానే చనిపోతున్నానంటూ ఒక లేఖ రాశాడు. గురువారం ఇంటికి వచ్చిన రవిశంకర్ తండ్రి తలుపులు తెరిచి చూడగా, మంచంపై చిన్నారుల మృతదేహాలు కనిపించాయి.

ఇదిలా ఉండగా, రవిశంకర్ ఫోన్ చివరిసారిగా కృష్ణా నది వద్ద ఆఫ్ అయినట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ దారుణ ఘటనపై పూర్తి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Read More : కొమ్మినేని శ్రీనివాసరావు విడుదలకు సుప్రీంకోర్టు ?

One thought on “ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విషాదం

Comments are closed.