ఆర్మీ హెలికాప్టర్‌కు తప్పిన ప్రమాదం

పంజాబ్‌లో ఆర్మీ హెలికాప్టర్‌కు ప్రమాదం తప్పింది. చండీగఢ్ నుంచి పఠాన్‌కోట్‌కు వెళ్తున్న ఎం-17 ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

ఈ సంఘటన రూప్‌నగర్ జిల్లాలోని బాన్ మజ్రా గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్‌ను పొలాల్లో సురక్షితంగా దిగజేశాడు.

ఈ ఘటనపై స్పందించిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవికుమార్, హెలికాప్టర్‌లో ఉన్నవారంతా సురక్షితంగా ఉన్నట్లు ధ్రువీకరించారు. ప్రస్తుతం హెలికాప్టర్‌ను పరిశీలించేందుకు సాంకేతిక బృందాలు అక్కడికి చేరుకున్నాయి.

Read More : ఒక్కరు ప్రాణాలతో బయటపడిన విశ్వాశ్ కుమార్ కథ

One thought on “ఆర్మీ హెలికాప్టర్‌కు తప్పిన ప్రమాదం

Comments are closed.