ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మోకాలి గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో సమాచారం ద్వారా వెల్లడించింది. నితీశ్ ఇటీవల జట్టుతో కలిసి మాంచెస్టర్ చేరుకున్నా, ఆదివారం ప్రాక్టీస్ సెషన్‌కు మాత్రం హాజరుకాలేకపోయాడు. జిమ్‌లో కసరత్తు చేస్తుండగా అతడికి మోకాలి గాయం అయినట్టు సమాచారం. స్కాన్‌లో లిగమెంట్ డ్యామేజ్ గుర్తించడంతో వైద్య బృందం అతన్ని మిగతా రెండు టెస్టులకు అందుబాటులో లేకపోవచ్చని సూచించింది.
ఇక పేసర్ ఆకాశ్ దీప్ సైతం గాయంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే వీరి గాయాలపై బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.నితీశ్‌కు గాయం కావడంతో శార్దూల్ ఠాకూర్ మరోసారి ప్లేయింగ్ XIలోకి రానున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోవడంతో శార్దూల్ స్థానంలో నితీశ్‌ను రెండో టెస్టులో ఆడించారన్న విషయం తెలిసిందే. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా, మరో సీమర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా చేతికి గాయం కారణంగా ఇప్పటికే సిరీస్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో అన్షుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం భారత్ సిరీస్‌లో 1-2తో వెనుకంజలో ఉంది. ఈ నెల 23న మాంచెస్టర్‌లో ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో గెలుపు అత్యంత అవసరం. ఇలాంటి కీలక సమయంలో ప్రధాన ఆటగాళ్లు గాయాల బారిన పడటం టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బగా మారింది.
Read More : లోనావాలా: సంగీత బిజ్లానీ బంగ్లాలో చోరీ, రూ.57 వేలు నష్టం

2 thoughts on “నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్”
Comments are closed.