వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025లో భాగంగా భారత్–పాకిస్థాన్ మధ్య బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ తీవ్ర వివాదాల నడుమ రద్దయింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్–పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో, భారత జట్టు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొనడాన్ని తిరస్కరించారు. భారత్‌పై ఇంతకుముందు తీవ్ర విమర్శలు చేసిన షాహిద్ అఫ్రిది పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడంపై కూడా అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో పాటు సోషల్ మీడియాలో కూడా భారీ విమర్శలు రావడంతో, మ్యాచ్‌ను రద్దు చేసిన డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు క్షమాపణలు తెలిపారు. ఈ నేపథ్యంలో అఫ్రిది స్పందిస్తూ, ‘‘క్రీడలు దేశాలను దగ్గర చేయాలి. రాజకీయాల ప్రభావం క్రీడలపై ఉండకూడదు. భారత్-పాక్ ఆడకూడదని భావిస్తే ముందే తెలియజేయాలి. ఒక చెడ్డ గుడ్డు మొత్తం పాడుచేస్తుంది’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ధవన్ పేరును ప్రస్తావించకుండానే ఈ విమర్శలు చేశారు. కాగా, శిఖర్ ధవన్ మ్యాచ్‌కి ముందు రోజే తన పాల్గొనబోనని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మే 11న నిర్వాహకులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ‘‘దేశ ప్రయోజనమే నాకు ముఖ్యమైనది’’ అని ధవన్ పేర్కొన్నారు. యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్‌కి దూరంగా ఉన్నారు.
అఫ్రిది మాట్లాడుతూ, ‘‘నా వల్ల మ్యాచ్ రద్దయిందని తెలిస్తే నేనే మైదానానికి వచ్చేవాడిని కాదు. షాహిద్ అఫ్రిది ఎవరు? క్రికెట్ ముందు నేను ఏమీ కాదు. క్రీడపై ప్రేమ ఉంటే రాజకీయాలు దూరంగా పెట్టాలి’’ అని అన్నారు.
ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వాహకులు షెడ్యూల్ ప్రకారమే మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేశారు. రద్దైన మ్యాచ్‌కు సంబంధించి పాక్ జట్టుకు రెండు పాయింట్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. భవిష్యత్‌లో భారత్–పాక్ మళ్లీ తలపడే అవకాశాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read More : నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్
