శరీరానికి అవసరమైన ప్రొటీన్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, అధిక మోతాదులో ప్రొటీన్‌ను తీసుకోవడం అనర్థదాయకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిమ్, డైట్ పేరుతో అధికంగా ప్రొటీన్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, దీని వల్ల కలిగే దుష్ప్రభావాలను గుర్తించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అధిక ప్రొటీన్ తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు:
🔹 తీవ్రమైన దాహం:
అధిక ప్రొటీన్ వల్ల శరీరానికి నీటి అవసరం పెరుగుతుంది. దీనివల్ల అధిక దాహం వేయడం, నీటి శాతం తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
🔹 నోటి దుర్వాసన:
శరీరంలో ప్రొటీన్ అధికమైతే నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రొటీన్‌లో ఉండే కొన్ని ఆమ్లాల ప్రభావమని నిపుణులు చెబుతున్నారు.
🔹 మలబద్ధకం:
అధిక ప్రొటీన్ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లను తగ్గించుకుని, ప్రొటీన్‌ను అధికంగా తీసుకుంటే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
🔹 ఒంటి నొప్పులు:
చికెన్, గుడ్లు, రొయ్యలు వంటి ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలు శరీరంలో వేడిని పెంచి, ఒంటి నొప్పులను కలిగించవచ్చు.
ప్రొటీన్ అధికంగా కలిగిన ఆహారాలు:
✔️ మటన్, చికెన్, గుడ్లు, చేపలు, రొయ్యలు
✔️ పాలు, పెరుగు, చీజ్
✔️ బాదం, జీడిపప్పు, వాల్నట్స్, గుమ్మడి గింజలు
✔️ శెనగలు, బీన్స్, టోఫు, సన్‌ఫ్లవర్ గింజలు
నిపుణుల సూచన:
ప్రొటీన్‌ను శరీర బరువుకు తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. సాధారణంగా, ఒక్క కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రొటీన్ సరిపోతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, ప్రొటీన్ ఆహారాన్ని సమతుల్యంగా తీసుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read More : “మహిళలు ప్రసవం సమయంలో ప్రాణాలు కోల్పోకూడదు” – ఆరోగ్య రంగంలో కీలక అజెండా

2 thoughts on “High Protein Diet: అధిక ప్రొటీన్ తీసుకుంటున్నారా?”
Comments are closed.