విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఛావా’ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మంత్ర ముగ్ధులను చేస్తోంది. మరాఠా సమ్రాట్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ హిందీలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మార్చి 7న తెలుగులో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఈ చిత్రంలో విక్కీ కౌశల్ అభినయం, భీకర యాక్షన్ సీన్స్, ఎమోషనల్ డ్రామా సినిమాకు హైలైట్ అయ్యాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెలుగులో విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లోనే 6.81 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఛావా సినిమా క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులను ఎమోషనల్‌గా టచ్ చేశాయి. అయితే కొన్ని థియేటర్లలో కొందరు ఆకతాయిలు ఈ కీలకమైన సన్నివేశాలను తేలిగ్గా తీసుకుని నవ్వుతూ, జోకులు వేస్తూ చిలిపి చేష్టలు చేశారు. దీంతో అక్కడున్న నిజమైన అభిమానులు ఆ ఆకతాయిలను హెచ్చరించి, థియేటర్ నుంచి బయటకు పంపారు. చివరగా వారిని మోకాళ్లపై కూర్చోబెట్టి, “ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై! శంభాజీ మహారాజ్ కి జై!” అనిపించేశారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఛావా సినిమాకు ఈ స్థాయి రెస్పాన్స్ రావడం, థియేటర్లలోనూ దీని ప్రభావం కనిపించడం అద్భుతమని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

One thought on “ఛావా మూవీకి తెలుగు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన – థియేటర్లో ఆసక్తికర ఘటన!”
Comments are closed.