ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. ఇప్పటికే ఎన్నికల అనంతరం రెండు కేసులు నమోదైన నేపథ్యంలో, తాజాగా ఆయన సన్నిహితులకు గుడివాడ పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు.
పోలీసుల దర్యాప్తు వేగవంతం
గుడివాడ పోలీసులు జారీ చేసిన నోటీసుల్లో దుక్కిపాటి శశిభూషన్, పాలడుగు రాంప్రసాద్, వైసీపీ గుడివాడ అధ్యక్షుడు గొర్ల శ్రీను ఉన్నారు. వీరిపై వలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించటం, లిక్కర్ గౌడౌన్ వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కొడాలి నాని, అప్పటి ఏపీ బేవరేజెస్ ఎండీ వాసుదేవ రెడ్డి, జేసీ మాధవీలత రెడ్డి తదితరులపై గుడివాడ పోలీసులు ఇప్పటికే వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
హైకోర్టు ఆదేశాలు – 41ఏ నోటీసులు
ఈ కేసులకు సంబంధించి విచారణ కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించడంతో, పోలీసులు నోటీసులు అందజేశారు. గుడివాడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కొడాలి నాని సన్నిహితులు 41ఏ నోటీసులను స్వీకరించారు.
కొడాలి నానిపై ఇప్పటికే కేసులు
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం, కొడాలి నానిపై గుడివాడ-02 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. గుడివాడ ఆటోనగర్‌కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ తన తల్లి మరణానికి కొడాలి నాని బాధ్యత వహించాల్సి ఉందని ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్‌ఐఆర్‌లో కొడాలి నాని, మాజీ బేవరేజెస్ ఎండీ వాసుదేవ రెడ్డి, అప్పటి కృష్ణా జిల్లా జేసీ మాధవీలతా రెడ్డిల పేర్లు చేర్చారు.
ఈ కేసుల్లో పోలీసులు 448, 427, 506, ఆర్ & డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. తాజా పరిణామాలతో కొడాలి నాని రాజకీయ భవితవ్యంపై అనేక ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

One thought on “కొడాలి నానికి వరుస షాక్‌లు”
Comments are closed.