‘హరిహర వీరమల్లు’పై నారా లోకేశ్ ప్రత్యేక ట్వీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణల దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరిహర వీరమల్లు’ రేపు గ్రాండ్‌గా విడుదల కానుంది. పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, సంగీతం మాస్టర్ో ఎంఎం కీరవాణి అందించారు.

సినిమా విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగా స్పందించారు. “మా పవన్ అన్న సినిమా ‘హరిహర వీరమల్లు’ విడుదల సందర్భంగా చిత్రబృందానికి హృదయపూర్వక అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఈ చిత్రం అద్భుత విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని లోకేశ్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read More : హరిహర వీరమల్లు హిట్ కావాలని అంబటి ట్వీట్

One thought on “‘హరిహర వీరమల్లు’పై నారా లోకేశ్ ప్రత్యేక ట్వీట్

Comments are closed.