పవన్ సినిమాకు ఊహించని వారినుండి పాజిటివ్ ట్వీట్

వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పవన్ సినిమాకు విష్ చేయడం జనరల్ గానే చేశారా? అనేది ఇప్పుడు చాలామందికి వచ్చిన డౌట్. పవర్ స్టార్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం హరి హర వీరమల్లు. ఎ. ఎం. రత్నం, పవర్ స్టార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రానికి ఎం.ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నేడు ప్రీమియర్స్ తో విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వెండితెరపై పవర్ స్టార్ ను చూసేందుకు థియేటర్స్ వద్ద హంగామా చేస్తున్నారు.

అయితే వైసీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నిత్యం అవాకులు చెవాకులు పేల్చే వైసీపీ పార్టీకి చెందిన సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హరిహర వీరమల్లునుద్దేశించి ఆయన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ‘పవన్ కల్యాణ్ గారి “హరిహర వీర మల్లు” సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేసారు. ఓ వైపు అంబటి రాంబాబు పార్టీ వారు పవన్ కల్యాణ్ తన సొంత సినిమా కోసం అధిక ధరకు టికెట్స్ ధర పెంచాడు అని కామెంట్స్ చేస్తుంటే, ఈయన ఇలా చేసిన ట్వీట్ అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పార్టీలు వేరైనా తమ హీరో సినిమాపై పాజిటివ్ ట్వీట్ చేయడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంబటి రాంబాబుకు థాంక్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రాజకీయం రాజకీయమే.. సినిమా సినిమానే. అభిమానం అలాంటిది మరి అనుకుంటున్నారు.

https://x.com/AmbatiRambabu/status/1947875556407603357

Read More : వందేభారత్‌ రైళ్లకు స్టాపేజీల కొనసాగింపు

One thought on “పవన్ సినిమాకు ఊహించని వారినుండి పాజిటివ్ ట్వీట్

Comments are closed.