ఆన్‌లైన్ లూడోలో రూ.5 లక్షలు నష్టం – యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ గేమింగ్ మరో ప్రాణాన్ని బలితీసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం జాక్లేర్ గ్రామానికి చెందిన గడ్డమీడి వెంకటేష్ (23) ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడి భారీ నష్టపోయి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం ప్రకారం, నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన వెంకటేష్ రోస్ట్ కేఫ్‌లో తోటమాలిగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఒక యాప్‌లో లూడో గేమ్ ఆడుతూ రూ.5 లక్షలు నష్టపోయాడు. అప్పుల ఒత్తిడితో మానసిక వేదనకు గురైన ఆయన చివరికి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పరిశీలనలో భాగంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం వల్ల యువత ప్రాణాలు కోల్పోతున్నారని మరోసారి చాటి చెబుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More : ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసాహారం తిని విషాదం

One thought on “ఆన్‌లైన్ లూడోలో రూ.5 లక్షలు నష్టం – యువకుడు ఆత్మహత్య

Comments are closed.