ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం

టెస్లా అధినేత, ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వంలో తాను నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం తన అధికారిక ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో ఒక ప్రకటనను విడుదల చేశారు.

తన సేవా కాలపరిమితి ముగిసిందని, ప్రభుత్వంలో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంలో అనవసరపు ఖర్చులను తగ్గించేందుకు చేపట్టిన విస్తృత కార్యక్రమంలో భాగస్వామిగా ఉండటం గర్వంగా భావిస్తున్నట్లు మస్క్ పేర్కొన్నారు. డోజ్ విభాగం భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని, తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.

గతంలో అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన ట్రంప్, ప్రభుత్వంలో సమర్థతను పెంపొందించేందుకు డోజ్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, మస్క్‌ను చైర్మన్‌గా నియమించారు. మస్క్ నేతృత్వంలో ఈ విభాగం అనేక ఖర్చు నియంత్రణ చర్యలు తీసుకుంది. వృథా వ్యయాలను తగ్గించి ప్రభుత్వానికి కోట్ల డాలర్ల ఆదా చేసినట్టు సమాచారం.

ఈ రాజీనామా నేపథ్యంలో, మస్క్ తర్వాత ఆ స్థానానికి ఎవరు వస్తారనే అంశంపై వాషింగ్టన్ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

Read More : రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి శాంతి..కానీ షరతులు: పుతిన్.