మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తెలంగాణ రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈనెల 8న ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ముఖాముఖీ చర్చకు రావాలని కోరుతూ, ఆయనకు 72 గంటల గడువు ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులకు ఎవరు ఏం చేశారో ప్రజలముందే తేల్చుకుందామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ‘‘పేటీఎం మాదిరిగా రేవంత్ రెడ్డిని ‘పే CM’ అని ప్రజలు పిలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతుబంధు’ నిధులను పూర్తిగా ఎగ్గొడుతోంది. అన్నదాతకు ఖర్చు పెడతామని చెప్పిన వారు ఇప్పుడు సున్నం పెట్టారు’’ అంటూ మండిపడ్డారు. రైతుల సమస్యలపై చింతమడక, కొండారెడ్డిపల్లె లేదా ఏ చోటైనా చర్చకు తాను సిద్ధమని తెలిపారు. ఉద్యోగాల విషయమై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ‘‘కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను, ఇప్పుడు తానే ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకోవడం దారుణం. నిరుద్యోగుల సమస్యలపై అశోక్ నగర్‌లో చర్చకు రావాలని కోరుతున్నాను. నాలుగు వేల పెన్షన్, రూ. 2,500 సాయం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు. కానీ వాస్తవంగా ఆయా హామీలు నెరవేర్చడం కనిపించడంలేదు’’ అని విమర్శించారు.
కేటీఆర్ వ్యాఖ్యల్లో కొంత దుశ్చిలుక తత్వం కూడా కనిపించింది. ‘‘వంద సీట్లు గెలిచే దమ్ము కాంగ్రెస్‌కు లేదు. సీఎం సొంత నియోజకవర్గంలో కూడా జెడ్పీటీసీ గెలవడం కష్టమని ప్రజల మద్దతు లేదన్న స్పష్టం అవుతోంది. రైతుకు ఎరువులు కూడా ఇవ్వలేని కాంగ్రెస్‌కు వ్యవసాయంపై చర్చ చేసే హక్కు లేదు. మత్స్య సంపద అభివృద్ధి కూడా కేసీఆర్ పాలనలోనే సాధ్యమైందని’’, కేటీఆర్ గుర్తు చేశారు.
అంతేకాక, ‘‘ఆంధ్రప్రదేశ్‌కు నీటిని పంపినవారు కాంగ్రెస్ నేతలే. అది తెలంగాణ రైతులకు అన్యాయం’’ అంటూ విమర్శలు గుప్పించారు.
Read More : చిన్నారులపై లైంగిక దాడులకు కఠిన శిక్షలు తప్పవు: సీఎం

One thought on “రైతులపై చర్చకు సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్”
Comments are closed.