విజయవాడ నీటి సరఫరాపై ప్రధాని మోదీ ప్రశంసలు: మంత్రి

విజయవాడలో నీటి సరఫరాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించడం గర్వకారణమని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ విజయవాడలో నీటి నిర్వహణపై ప్రత్యేకంగా ప్రశంసలు చేసినట్లు గుర్తుచేశారు.

ఈ సందర్భంగా విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో పాటు అధికారులు, సిబ్బందిని మంత్రి నారాయణ అభినందించారు. ‘‘ప్రధాని మోదీ ప్రశంసలు కూటమి ప్రభుత్వ అభివృద్ధి పథానికి నిదర్శనం. సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో విజయవాడ ఇటీవల స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు సాధించింది’’ అని పేర్కొన్నారు. ప్రతిరోజూ 16 లక్షల మందికి శుద్ధమైన తాగునీరు అందిస్తున్నామని, కొండప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా జరుగుతోందని మంత్రి వివరించారు. అమృత్ పథకం ద్వారా కేంద్రం కేటాయించిన నిధులతో వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Read More : తెలుగువారంతా రాష్ట్ర రక్షణకు ముందుకొచ్చారు – మంత్రి