లోకేష్‌కు రాఖీలు కట్టిన మంగళగిరి మహిళలు

రక్షాబంధన్ పండుగ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌కు మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు మహిళలు రాఖీలు కట్టారు. అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగను పురస్కరించుకుని వారు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

తమ అన్నగా భావించి లోకేష్‌కు రాఖీ కట్టి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కూడా మహిళలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

Read More : బాలకృష్ణకు రాఖీ కట్టిన సోదరి పురందేశ్వరి