TPCC చీఫ్ మహేష్ గౌడ్ ఫైరింగ్

మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తాజా వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల ఉపయోగించిన భాష అనుచితమని ఆయన మండిపడ్డారు. సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మహేష్ గౌడ్, ‘‘పదవి రాక ఫ్రస్ట్రేషన్ తో ఈటల విరుచుకుపడుతున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కారణంగా ఈటల‌కు అవకాశాలు దూరమవుతున్నాయి. ఆ బాధను సీఎం రేవంత్‌పై చూపుతున్నారు,’’ అని వ్యాఖ్యానించారు.

ఈటలపై దేవాలయ భూముల అక్రమ కబ్జా ఆరోపణలపై కేసు నమోదు అయిన విషయాన్ని గుర్తు చేసిన మహేష్ గౌడ్, సంక్షేమ పథకాల అమలుతో తమ ప్రభుత్వం పడిపోతుందా అనే ప్రశ్నను ఈటల సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. ‘‘బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వెళ్తూ బీజేపీలో చేరిన ఈటల… మళ్లీ బీఆర్‌ఎస్ వైపు కన్నేస్తున్నారు,’’ అంటూ విమర్శించారు.

ఒక్క విజిల్ ఇస్తే రాష్ట్రంలో ప్రజలు ఈటల గురించి ఏమంటారో తెలిసిపోతుందని హెచ్చరించిన మహేష్ గౌడ్, ‘‘రాష్ట్రాన్ని దోచిన దొంగల్లో ఈటల కూడా ఉన్నారు. కేటీఆర్, ఈటల రాజేందర్ మాటలు ఒకేలా వినిపిస్తున్నాయి’’ అంటూ విమర్శలు గుప్పించారు.

ఈ వ్యవహారం పట్ల కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Read More : జిన్నారం మదర్సా పై బీజేపీ ఎంపీ గట్టి విమర్శలు.