ఇన్‌స్టాగ్రామ్ యువకుడి కోసం బిడ్డను వదిలిన తల్లి

నల్గొండ ఆర్టీసీ బస్టాండ్‌లో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడిని కలిసేందుకు వచ్చిన ఓ మహిళ తన చిన్నారిని వదిలేసి వెళ్లిపోయింది.

వివరాలు ఇలా ఉన్నాయి: హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడిని కలిసేందుకు నల్గొండకు వచ్చింది. బస్టాండ్‌లోనే తన చిన్న బిడ్డను వదిలేసి ఆ యువకుడితో కలిసి బైక్‌పై వెళ్లిపోయింది. తల్లిని కోసం విలపిస్తున్న బాలుడిని చూసిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే అతన్ని ఆదుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై స్పందించిన పోలీసులు తల్లిదండ్రుల ఆచూకీ కనుగొని బాలుడిని సురక్షితంగా అప్పగించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

Read More : షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

One thought on “ఇన్‌స్టాగ్రామ్ యువకుడి కోసం బిడ్డను వదిలిన తల్లి

Comments are closed.