హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. షటిల్ ఆడుతూ యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు.
వివరాల్లోకి వెళ్తే, నాగోల్ స్టేడియంలో మంగళవారం రాత్రి 25 ఏళ్ల గుండ్ల రాకేష్ షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. సహచరులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రాకేష్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read More : పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం

One thought on “షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి”
Comments are closed.