వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో నిరాశ — విచారణ వారం వాయిదా!

Vamsi gets security in jail

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. స్థలం ఆక్రమణ కేసులో వంశీ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం ఈ రోజు (సోమవారం) విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తీర్పు ఇవ్వకుండా విచారణను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది.

ఈ కేసుతో పాటు వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే వంశీపై పీటీ వారెంట్లు కూడా దాఖలయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో సహా పలుచోట్ల వంశీపై కేసులు నమోదయ్యాయి.

ఈక్రమంలో గన్నవరం టీడీపీ కార్యాలయ దాడి కేసులో వంశీ రిమాండ్ గడువును ఈనెల 23వ తేదీ వరకు విజయవాడ సీఐడీ కోర్టు పొడిగించింది. ఈ కేసులో వంశీతో పాటు మరో తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో పలుమార్లు రిమాండ్‌ను పొడిగించిన కోర్టు, మరోసారి కూడా రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వంశీ బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణ వారం రోజుల తర్వాత జరగనుంది.

Read More : తిరుమలలోని విశాఖ శారదా పీఠం భవనాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటోంది

One thought on “వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో నిరాశ — విచారణ వారం వాయిదా!

Comments are closed.