భారత రైతుల ప్రయోజనాల కోసం ఎలాంటి మూల్యమైనా చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు దేశ ఆర్థిక నిర్మాణానికి పునాది అని పేర్కొంటూ, వారి సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. ఇటీవల అమెరికా భారత ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకం విధించింది. ఇది ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకంతో కలిపి మొత్తం 50 శాతానికి చేరింది. ఇది రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు కొనసాగిస్తున్న భారత్‌పై ప్రతీకార చర్యగా భావిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహించిన ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సులో మాట్లాడిన మోదీ మాట్లాడుతూ… “రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ అనేది భారత పదకోశంలో లేదు. అవసరమైతే వ్యక్తిగతంగా కూడా నేను తగిన మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను” అని చెప్పారు.
అమెరికా నిర్ణయంపై భారత విదేశాంగ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. “భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమైన, అహేతుకమైన చర్య. 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతకు అనుగుణంగానే చమురు దిగుమతులు జరుగుతాయి” అని తేల్చిచెప్పింది. అంతేకాకుండా, దేశ ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
Read More : విద్యార్థులు దేశ అభివృద్ధికి దారితీయాలి

One thought on “ప్రధానమంత్రి మోదీ స్పష్టంచేశారు.”
Comments are closed.