పుల్వామా దాడి వంటి అమానవీయ చర్యలకు పాల్పడిన అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ మరోసారి వివాదాస్పద లేఖతో దూకుడును ప్రదర్శించాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ హెచ్చరికలతో కూడిన ఓ లేఖను విడుదల చేశాడు.
ఈ లేఖలో మసూద్ అజహర్ ప్రధాని మోడీపై తీవ్రంగా విమర్శలు చేస్తూ, ఆయన అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారని ఆరోపించాడు. ‘‘నాకు భయం లేదు, నాకు నిరాశ లేదు, నాకు విచారం కూడా లేదు’’ అంటూ ధిక్కార స్వరంతో వ్యాఖ్యానించాడు. తన కుటుంబ సభ్యుల మరణం వంటి తీవ్ర ఘటనల తరువాత కూడా భారత ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకుంటానని స్పష్టం చేశాడు.
భారత్‌ను నాశనం చేస్తానంటూ, మోడీపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ మసూద్ అజహర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారి తీసేలా ఉన్నాయి. భారత్‌పై మరోసారి కుట్రలు పన్నే ఉద్దేశంతోనే ఈ లేఖ విడుదలైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రతా రంగ అధికారులు ఈ లేఖను పక్కాగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఈ లేఖ తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. మసూద్ అజహర్ మళ్లీ భారత్‌పై విషం చిమ్మడం ఖండనీయమని పలువురు నేతలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు ఉగ్రవాద మానసికతకు నిదర్శనమని, దేశ భద్రతపై మళ్లీ అప్రమత్తత అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Read More : ప్రజల్లో అవగాహన పెంపుదల లక్ష్యం

One thought on “భారత ప్రధాని మోడీపై మసూద్ అజహర్ లేఖతో వివాదం”
Comments are closed.