Rajnath Singh : భారత సైన్యం శత్రువులకు గుణపాఠం చెప్పింది

భారత సైన్యం అత్యంత కట్టుదిట్టంగా, కచ్చితంగా నిర్వహించిన “ఆపరేషన్ సింధూర్”పై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. దేశ ప్రజల గర్వాన్ని పెంచేలా సైన్యం విజయం సాధించిందని ప్రశంసించారు.

ఈ ఆపరేషన్ స్ఫూర్తికి సంబంధించి మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ – “మేము ఈ ఆపరేషన్‌ను హనుమంతుడి లంకాదహనాన్ని ఆదర్శంగా తీసుకుని నిర్వహించాం. దేశంపై దాడులు చేసిన శత్రువులకు తగిన రీతిలో బలమైన బుద్ధి చెప్పాం. ఇది కేవలం యుద్ధం కాదు.. దేశ భద్రతను కాపాడటానికి, అమాయకుల ప్రాణాలు పోయిన వారికి న్యాయం చేయడమే మా లక్ష్యం.”

“కచ్చితమైన ఇంటలిజెన్స్ ఆధారంగా మాత్రమే దాడులు నిర్వహించాం. ఉగ్ర స్థావరాలే లక్ష్యం. సామాన్య పౌరులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని ఆయన స్పష్టం చేశారు.

భారత సైన్యం చూపిన ధైర్యం, అంకితభావం దేశమంతా గర్వపడేలా చేసిందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కూడా దేశానికి ముప్పుగా మారే ఎటువంటి శక్తినైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో దేశ ప్రజల్లో భద్రతపై నమ్మకాన్ని మరింతగా పెంచిందని, ఉగ్రవాదంపై భారత్ తలవంచదని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

Read More : భారత ప్రధాని మోడీపై మసూద్ అజహర్ లేఖతో వివాదం

One thought on “Rajnath Singh : భారత సైన్యం శత్రువులకు గుణపాఠం చెప్పింది

Comments are closed.