జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం (ఫ్లైట్ JL8696/IJ004) ఒక్కసారిగా గాల్లో కలకలం రేపింది. శాంఘై నుంచి టోక్యో వెళ్లే సమయంలో విమానం 36 వేల అడుగుల ఎత్తు నుంచి కేవలం 10 నిమిషాల్లో 10,500 అడుగులకు పడిపోయింది. ఈ ఘటన ప్రయాణికుల్లో భయానక పరిస్థితులను ఏర్పరిచింది. విమానంలో క్యాబిన్ ప్రెజర్ సమస్య తలెత్తడంతో వెంటనే ఆక్సిజన్ మాస్కులు విడుదలయ్యాయి. ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. పైలట్ చాకచక్యంగా స్పందించి విమానాన్ని ఒసాకాలోని కన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 191 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. సకాలంలో తీసుకున్న చర్యల వల్ల ఎవరికి ఎటువంటి హానీ జరగకపోవడం ఊరటనిచ్చింది. విమానానికి సాంకేతిక లోపం ఎలా తలెత్తింది అన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Read More : భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశలో

One thought on “టోక్యోకి వెళ్తున్న జపాన్ విమానానికి సాంకేతిక లోపం”
Comments are closed.