బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై పోలీసుల కేసులో ఫిర్యాదుదారుడైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఇతర వివరాల్లోకి వెళితే, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనపై నకిలీ వీడియోలు విడుదల చేశారని ఆరోపిస్తూ తీన్మార్ మల్లన్న, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై గతేడాది మే 25న పోలీసులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్, జగదీశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ మౌసమీ భట్టాచార్య, పిటిషనర్ల తరఫున న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపించారు. కేటీఆర్, జగదీశ్ రెడ్డి ఎవ్వరిపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని, రాజకీయ కక్షసాధింపులో భాగంగా ఈ కేసు నమోదయ్యిందని వాదించారు.
వాదనలు విన్న న్యాయమూర్తి, పోలీసులు మరియు తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేసి, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 13కు వాయిదా వేశారు.
Read More : గంభీరావుపేటలో దారుణ ఘటన

One thought on “ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు”
Comments are closed.