లిక్కర్ స్కామ్‌లో ఈడీ రంగంలోకి..?

హైదరాబాద్‌లో లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధ్వర్యంలో కొనసాగుతుండగా, తాజాగా కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు, ఈడీ ఇప్పటికే సిట్ అధికారుల నుంచి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించింది. ప్రాథమిక పరిశీలన అనంతరం ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని కీలక వ్యక్తులు కూడా రాబోయే రోజుల్లో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండొచ్చని సమాచారం.

ఈ పరిణామాలతో కేసు కొత్త మలుపు తిరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read More : రాచకొండలో అంతరాష్ట్ర సెల్‌ఫోన్ దొంగల ముఠా బస్టు

One thought on “లిక్కర్ స్కామ్‌లో ఈడీ రంగంలోకి..?

Comments are closed.