తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన డాక్టర్ రామచందర్‌రావు నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న రామచందర్‌రావు, అనంతరం ఉదయం 9 గంటలకు గన్ పార్క్‌లో అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు.
తరువాత ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది.
Read More : పదో తరగతి విద్యార్థులకు సైకిళ్ల బహూకరణ
